Sunday, June 8, 2025
Homeజిల్లా వార్తలుజయశంకర్ భూపాలపల్లిలో బ్యాంకుదోపిడీకి యత్నం..

జయశంకర్ భూపాలపల్లిలో బ్యాంకుదోపిడీకి యత్నం..

కొయ్యూరు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో ఘటన
గ్యాస్ కట్టర్లతో మెయిన్ గేట్,కిటికీ కట్ చేసిన దుండగులు
సీసీ కెమెరాలు పరిశీలిస్తున్న పోలీసులు
స్పాట్ వాయిస్, మల్హర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దుండగులు బ్యాంకు చోరీకి విఫలయత్నం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని కొయ్యూరు తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌లో చోరీకి దుండగులు యత్నించారు. బ్యాంక్ సిబ్బంది మంగళవారం విధులు ముగించుకొని వెళ్లి బుధవారం ఉగాది పండగ సెలవు అనంతరం గురువారం ఉదయం బ్యాంక్ ఓపెన్ చేయడానికి వచ్చారు. ఈ క్రమంలో బ్యాంకు సైడ్ గేట్ తాళం పగల గొట్టి కిటికీ ద్వారా లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నించిన ఆనవాలు ఉండటంతో వెంటనే బ్యాంక్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే కాటారం సీఐ రంజిత్ రావు సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని సీసీ కెమెరా ఫుటేజీలుపరిశీలిస్తున్నారు. ఇది ఇలా ఉండగా బ్యాంక్ దోపిడీ కోసం ఉపయోగించిన గ్యాస్ కట్టర్ ను కొయ్యూరులోని ఓ వెల్డింగ్ షాప్ నుంచి మంగళవారం రాత్రి దొంగిలించినట్టుగా సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments