వడగండ్ల బాధితులను ఆదుకోవాలి
మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు సాదు నర్సింగరావు
స్పాట్ వాయిస్, నర్సంపేట : పంటలు దెబ్బతిన్న రైతులకు, ఇళ్లు దెబ్బతిన్న బాధితులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని మాల మహానాడు వరంగల్ జిల్లా అధ్యక్షుడు సాదు నర్సింగరావు డిమాండ్ చేశారు. ఆదివారం నర్సంపేట పట్టణంలోని మాల మహానాడు ముఖ్య కార్యకర్తల అత్యవసర సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు నర్సింగరావు హాజరై మాట్లాడారు. శనివారం అర్ధరాత్రి నుంచి భారీగా కురిసిన వడగండ్ల వర్షానికి జిల్లా వ్యాప్తంగా మొక్కజొన్న వరి, ఇతర పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. ముఖ్యంగా నర్సంపేట డివిజన్లో వివిధ మండలాల్లో వందల ఎకరాల్లో మొక్కజొన్న పంట వేయగా వడగండ్ల వర్షానికి పంట పూర్తిగా దెబ్బ తినడంతో రైతులు ఆవేదన చెందుతున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే అధికారులతో పంట నష్టాన్ని అంచనావేయించి రైతులకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. వడగండ్ల వానకి రాళ్ల ప్రభావంతో రేకుల షెడ్లు, రేకుల ఇండ్లు దెబ్బతిన్నాయని, లోపల సామాగ్రి తో పాటు ఆస్తి నష్టం వాటిల్లిందన్నారు. నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం నుంచి బాధితులకు నష్టపరిహారం అందించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మాలమహనడు జిల్లా ప్రధాన కార్యదర్శి కోతి విష్ణు, జిల్లా కార్యదర్శి కున్నామల్ల కమలాకర్ తదితరులు ఉన్నారు.
వడగండ్ల బాధితులను ఆదుకోవాలి
RELATED ARTICLES
Recent Comments