వదలని‘వడగండ్ల’వాన
భారీగా పంట నష్టం
ప్రభుత్వం ఆదుకోవాలని రైతుల వినతి..
స్పాట్ వాయిస్,సంగెం; మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఆదివారం ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వర్షం బీభత్సం సృష్టించింది. మండలంలోని గొల్లపల్లిలో వర్ష బీభత్సవానికి మెరుగు స్వామి, ఇమ్మడి కట్టయ్య, పెరబోయినా చిన్న మల్లయ్య, బాబు కట్టయ్య కు చెందిన 40 గొర్రెలు, మేకలు మృతి చెందాయి. వడగండ్ల దెబ్బకు చేతికొచ్చిన వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి.ఎ క్కడ చూసినా పెద్ద పెద్ద చెట్లు, కరెంటు స్తంబాలు విరిగి పడ్డాయి. ఇండ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. పౌల్ట్రీఫామ్ గోడలు, రేకులతో సహా కూలి నేలమట్టమయ్యాయి. మండలంలోని తిమ్మాపురం గ్రామంలో వర్షం, ఈదురు గాలుల కారణంగా వరి మొక్కజొన్న పంటలు నేలకొరగడంతొ రైతులు కన్నీటి పర్యంతమయ్యరు. బీభత్సమైన గాలి, వర్షాల కారణంగా గొల్లపల్లి గ్రామంలో 40 గొర్రెలు మేకలు మృతి చెందడంతో పెంపకదారులు లబోదిమన్నారు. ఇంటి పైకప్పు రేకులు గాలికి ఎగిరి పోయాయి. అకాల వర్షం కారణంగా గాంధీనగర్, కొత్తగూడెం గ్రామంలో వరి, తదితర పంటలు నేలమట్టమయ్యాయి. చెట్లు కూలి రోడ్లకు అడ్డంగా పడడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది, .అక్కడక్కడా కరెంటు స్తంబాలు విరిగి పడడంతో మండలంలోని పలు గ్రామాలలో కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కాగా పంట నష్టపోయిన రైతులకుఆర్థిక సహాయం అందించాలని బాధితులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు
సంగెం మండలంలో వందల ఎకరాల్లో పంట నష్టం జరిగిన అధికారులు మాత్రం క్షేత్రస్థాయి పర్యటనకు దూరంగా ఉంటు కాకి లెక్కలు రాసుకుంటున్నారని రైతులు మండిపడుతున్నారు. సంగెం మండలంలోని గొల్లపల్లి గ్రామంలో 35 గొర్రెలు చనిపోయాయి. వివిధ గ్రామాలలో పెద్ద ఎత్తున నష్టం చోటు చేసుకుంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పంట నష్టం తో పాటు ఆస్తి నష్టం సైతం చోటు చేసుకుంది. విద్యుత్ సరఫరాకు గంటల తరబడి అంతరాయం కలుగుతుండటంతో జనం ఆవస్థలు పడుతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టంపై సమగ్ర నివేదికలను తయారు చేసి తమను ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని వివిధ గ్రామాల రైతులు కోరుతున్నారు.
Recent Comments