విచారణపై స్టేకు నిరాకరణ
మార్చి 24కు వాయిదా..
16న ఈడీ ఎదుట హాజరుకావాల్సిందే
స్పాట్ వాయిస్, బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితకు బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఈడీ నోటీసులపై తనకు తాత్కాలిక ఊరట ఇవ్వాలన్న ఆమె పిటిషన్ ను తోసిపుచ్చింది. విచారణపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. కవిత దాఖలు చేసిన పిటీషన్ పై విచారణను సుప్రీం కోర్టు మార్చి 24వ తేదీకి వాయిదా వేసింది. మార్చి 16న ఈడీ అధికారుల ఎదుట ఎమ్మెల్సీ కవిత హాజరు కావాల్సింది ఉంది. ఈ సమయంలోనే విచారణకు బ్రేక్ వేయాలంటూ.. ఈడీ ఎదుట హాజరయ్యేందుకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
ఢిల్లీ వెళ్లిన కవిత
ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ వెళ్లారు. అయితే ఒకరోజు ముందు మంగళవారం ఆమె కొండగట్టు అంజన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామున 5 గంటలకు ఆలయానికి వచ్చి స్వామి సన్నిధిలో దాదాపు గంట సేపు గడిపారు. వ్యక్తిగత సహాయ సిబ్బంది, గన్‌మన్‌లతో మాత్రమే కవిత గుడికి వచ్చారు. గురువారం ఈడీ విచారణ ఉన్న నేపథ్యంలో ఆమె అంజన్నను దర్శించుకోవడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. కాగా, మహిళా రిజర్వేషన్ బిల్లుపై కవిత నేతృత్వంలో బుధవారం ఢిల్లీలో రౌండ్ టేబుల్ సమావేశం జరగనుంది.
Recent Comments