నేడు బీఆర్ఎస్ కీలక సమావేశం..
భవిష్యత్తు కార్యాచరణపై చర్చ..
స్పాట్ వాయిస్, హైదరాబాద్ : నేడు బీఆర్ఎస్ కీలక సమావేశం జరగనుంది. శుక్రవారం మధ్యాహ్నం పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ, శాసనసభ పక్షం, కార్యవర్గం సంయుక్త సమావేశం జరగనుంది. ఎన్నికల సంవత్సరంలో పార్టీ కార్యాచరణపై శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. కవితకు ఈడీ నోటీసుల నేపథ్యంలో బీఆర్ఎస్ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన.. మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్‌లో సమావేశం జరగనుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, కార్యవర్గ సభ్యులతోపాటు జిల్లా అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, కార్పొరేషన్ల చైర్మన్లు, డీసీఎంఎస్, డీసీసీబీ చైర్మన్లను సమావేశానికి ఆహ్వానించారు. ఈ ఏడాదే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ కార్యాచరణపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. రాజకీయకక్ష సాధింపు చర్యల్లో భాగంగా పార్టీ నాయకులపై జరుగుతున్న సీబీఐ, ఈడీ, ఐటీ దాడులను ఎలా ఎదుర్కోవాలనే అంశంపై కేసీఆర్ మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. కవితకు ఈడీ నోటీసులను.. ఈ సమావేశంలో ఖండించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
Recent Comments