గ్లోబల్ రెయిన్ బో పాఠశాలలో మహిళా దినోత్సవ వేడుకలు
స్పాట్ వాయిస్, ఖమ్మం: కూసుమంచి మండల కేంద్రంలో గల గ్లోబల్ రెయిన్బో పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ను ఘనంగా నిర్వహించారు. ఇండియన్ రైఫిల్ షూటింగ్ లో ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్ సాధించిన ఈ పాఠశాల పూర్వ విద్యార్థిని తనిమ్ మారియా ను పాఠశాల కరస్పాండెంట్ ఎండీ ఎర్షాద్ సన్మానించారు, ఆమెను స్ఫూర్తిగా తీసుకొని మిగతా విద్యార్థులు ఎదగాలని ఆమే చేత ఒక మొక్కను నాటించారు . ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ఎండి ఎర్షాద్ అహ్మద్ మాట్లాడుతూ.. నేటి బాలికలు జీవితంలో తమకంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని చరిత్రలో తమకంటూ ఒక పుటను లిఖించుకోవాలని దానికి ఎల్లవేళలా కృషి చేయాలని ఆకాంక్షించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న సీనియర్ కళాశాల అధ్యాపకురాలు శ్రీమతి సృజన గారు మాట్లాడుతూ మహిళలందరూ మహిళా సాధికారతను సాధించాలని విద్యార్థులందరూ ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మహిళ ఉపాధ్యాయులను , బోధ నేతర మహిళా సిబ్బందిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అకాడమిక్ డైరెక్టర్ ఇంతియాజ్ అహ్మద్, పాఠశాల ఇంచార్జ్ జాహ్నవి ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Recent Comments