Saturday, April 19, 2025
Homeలేటెస్ట్ న్యూస్నా కూతురిది హత్యే..

నా కూతురిది హత్యే..

మీడియాతో ప్రీతి తండ్రి
స్పాట్ వాయిస్, హైదరాబాద్: ప్రీతిది ఆత్మహత్య కాదని.. హత్యేనని ఆమె తండ్రి ధారవత్ నరేందర్ పేర్కొన్నారు. సోమవారం డీజీపీని కలవడానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. తమకు ఎలాంటి టాక్సికాలజీ రిపోర్ట్ రాలేదన్నారు. ఈ కేసుపై సమగ్ర విచారణ జరిపించాలని డీజీపీకి కోరాడనికి వచ్చామని చెప్పారు. నిందితులకు సరైన శిక్ష పడేలా చూడాలని కోరుతామన్నారు. ఆదివారం మట్టెవాడ పోలీసులు తమ ఇంటికి వచ్చి విచారించారన్నారు. ఘటనపై మరోసారి స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారన్నారు. ఒకవేళ టాక్సికాలజీ వచ్చిన కాజ్ ఆఫ్ డెత్ క్లియర్ తెలియదన్నారు. టాక్సికాలజీ కోసం తీసుకున్న నమూనాలు, అప్పుడే ఎక్కించిన రక్తవి అని.., అందుకే సరైన రిపోర్ట్ రాదని డాక్టర్లు చెప్పారన్నారు. వరంగల్ లో ఘటన జరిగిన రోజు ఎంజీఎంలో నమూనాలు తీసుకొని ఉంటే టాక్సికాలజీ రిపోర్ట్ సరైన ఫలితం వచ్చేందని ప్రీతి తండ్రి పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments