Tuesday, November 26, 2024
Homeజిల్లా వార్తలు'కంటివెలుగు'తో ఇంటింటా వెలుగు

‘కంటివెలుగు’తో ఇంటింటా వెలుగు

‘కంటివెలుగు’తో ఇంటింటా వెలుగు

-కొత్తగూడెం గ్రామంలో కంటి వెలుగు

 ప్రారంభించిన సర్పంచ్ వాసం రజిత-సాంబయ్య

స్పాట్ వాయిస్,సంగెం:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కంటివెలుగు కార్యక్రమాన్ని పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారు సద్వినియోగం చేసుకోవాలని కొత్తగూడెం సర్పంచ్ వాసం రజిత-సాంబయ్య అన్నారు. మండలంలోని కొత్తగూడెం గ్రామంలో గురువారం కంటివెలుగు కార్యక్రమాన్ని సర్పంచ్ ప్రారంభించారు. అనంతరం వాసం రజిత-సాంబయ్య మాట్లాడుతూ.. కంటికి సంబంధించి ఇబ్బందులు ఉన్న ప్రజలకు కంటివెలుగు కార్యక్రమం ద్వారా మంచి అనుభవం ఉన్న కంటి వైద్యులతో ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన వారికి అప్పుడే కళ్ళద్దాలు అందిస్తున్నారని చెప్పారు. కొత్తగూడెం గ్రామంలో కంటివెలుగు కార్యక్రమం ఎంతో బాగా నిర్వహిస్తున్నమని ఈ విషయంలో ప్రత్యేకంగా కంటి వైద్యులు పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.ఈ కంటి పరీక్షలలో అవసరమైన వారికి కళ్ళద్దాలు,మందులు,ఐ డ్రాప్స్ ఉచితంగా అందచేస్తున్నమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీ సీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడు వాసం సాంబయ్య, హరిబాబు, సారంగపాని,అశోక్,బిక్షపతి,పంచాయితీ కార్యదర్శి అశోక్,కంటి వెలుగు సిబ్బంది,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments