రాజకీయ వేడి నేపథ్యంలో ఎస్పీ సంచలన నిర్ణయం
స్పాట్ వాయిస్, భూపాలపల్లి : జిల్లాలో రాజకీయ పార్టీలు సంయమనం పాటించాలని, ప్రజలను ఇబ్బంది పెట్టేలా బల ప్రదర్శనకు దిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని భూపాలపల్లి ఎస్పీ జె. సురేందర్ రెడ్డి అన్నారు. గురువారం నుంచి వారం వరకు జిల్లా కేంద్రంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో గుంపులు,గుంపులుగా ఎవరూ గుమికూడొద్దని, జన జీవనానికి ఇబ్బంది కలిగించ వద్దని ఎస్పీ బుధవారం ఒక ప్రకటనలో కోరారు. శాంతి భద్రతల పరిరక్షణ లో భాగంగా రాజకీయ పార్టీల నాయకుల సవాళ్లకు, బహిరంగ చర్చలకు పోలీసు శాఖ అనుమతి లేదని ఎస్పీ స్పష్టం చేశారు. ముందస్తుగా పట్టణంలో 144 సెక్షన్ విధించామని, ఎవరూ బయటకి రాకూడదని పేర్కొన్నారు. మంగళవారం జరిగిన ఇరు పార్టీల మధ్య జరిగిన గొడవలు, దాడుల విషయంలో రెండూ పార్టీల కార్యకర్తల మీద కేసులు నమోదు చేశామని చెప్పారు. జిల్లా కేంద్రానికి నలుమూలల నుంచి ప్రజలు వివిధ అవసరాల నిమిత్తం వస్తారని, ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దని రాజకీయ పార్టీలకి ఎస్పీ సూచించారు. రేపు నిర్వహించనున్న బహిరంగ చర్చ కార్యక్రమాన్ని విరమించుకోవాలని, ఇరు పార్టీల కార్యకర్తలు, నాయకులు సంయమనం పాటించాలని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరిని వదిలేది లేదని స్పష్టం చేశారు.
భూపాలపల్లి వారం రోజులు 144 సెక్షన్..
RELATED ARTICLES
Recent Comments