Thursday, May 29, 2025
Homeలేటెస్ట్ న్యూస్రేవంత్ సభపై రాళ్లు, గుడ్లతో దాడి

రేవంత్ సభపై రాళ్లు, గుడ్లతో దాడి

భూపాలపల్లిలో ఉద్రిక్తత

రేవంత్ సభపై బీఆర్ ఎస్ రాళ్లదాడి

స్పాట్ వాయిస్, భూపాలపల్లి: భూపాలపల్లిలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జోడో యాత్ర వద్ద మంగళవారం రాత్రి ఉద్రిక్తత నెలకొంది. కార్నర్ మీటింగ్ లో భాగంగా రేవంత్ మాట్లాడుతుండగా బీఆర్ ఎస్ కార్యకర్తలు సభా వేదిక వైపు దూసుకొచ్చేందుకు యత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎలాంటి ఘర్షణలు జరుగకుండా వారిని అదుపులోకి తీసుకుని స్థానిక థియేటర్ లో బంధించారు. ఈ క్రమంలో రేవంత్ మీటింగ్ వద్దకు భారీగా చేరుకున్న బీఆర్ ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒక దశలో సహనం కోల్పోయిన కొందరు రేవంత్ సభ వైపు రాళ్లు, కోడిగుడ్లు, టమాటాలు విసిరారు. ఇరువర్గాల రాళ్ల దాడిలో సినిమా థియేటర్ ధ్వంసం అయింది. అయినా రేవంత్ రెడ్డి తన ప్రసంగాన్ని కొనసాగించారు. తెలంగాణ రాష్ట్రం దోపిడీ దొంగల చేతిలో బంధీ అయిందని వాపోయారు. తెలంగాణ ల్యాండ్, సాండ్, లిక్కర్ మాఫియాచేతితో లూటీ అవుతోందని, వారికి తగిన బుద్ధి చెప్పాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments