Monday, November 25, 2024
Homeలేటెస్ట్ న్యూస్డీఎస్‌కు తీవ్ర అస్వస్థత

డీఎస్‌కు తీవ్ర అస్వస్థత

ఆస్పత్రిలో చేర్పించిన కుటుంబ సభ్యులు
స్పాట్ వాయిస్, నిజామాబాద్: పీసీసీ మాజీ చీఫ్ డి శ్రీనివాస్‌ (డీఎస్) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. డీఎస్‌కు ఫిట్స్ రావడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన సిటీ న్యూరో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స జరుగుతోంది. ఈ విషయాన్ని ఆయన కుమారుడు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ స్వయంగా ట్విటర్ వేదికగా వెల్లడించారు. తన తండ్రి తీవ్ర అనారోగ్యం బారిన పడ్డారని.. ఆస్పత్రిలో చికిత్స జరుగుతోందని కాబట్టి రెండు రోజుల పాటు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనలేనని ట్విటర్ వేదికగా తన కార్యకర్తలకు తెలిపారు. ‘‘మా నాన్న డి. శ్రీనివాస్ గారు తీవ్ర అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు’’ అని అరవింద్ తన ట్వీట్‌లో తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments