ఎన్నారై ఉద్యోగులు రూ.40వేలు, అంగన్ వాడీ టీచర్ రూ.10వేల సాయం
డీడబ్ల్యుఓ శామ్యూల్ చేతుల మీదుగా అందజేత
స్పాట్ వాయిస్, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న మహమ్మద్ అనీఫ్ (18) ఐదేళ్ల క్రితం కోతుల దాడిలో ప్రమాదానికి గురయ్యాడు. ఈ క్రమంలో నడుముకు బలంగా దెబ్బ తగలడంతో మంచానికే పరిమితమయ్యాడు. అంగన్ వాడీ టీచర్ అనీఫ్ పరిస్థితిని తన ఫోన్ లో వీడియో తీసి జిల్లా ఇంచార్జి బాలల సంరక్షణ అధికారికి పంపారు. సదరు వీడియోను ఆస్ట్రేలియా లో ఉంటున్న కొందరు యువకులకు సోషల్ మీడియా ద్వారా పంపించగా.. స్పందించిన ఎన్నారై ఉద్యోగులు రూ. నలభై వేల రూపాయలను వైద్య ఖర్చుల కోసం పంపించారు. అలాగే అతడి పరిస్థితిని చూసి చలించిపోయిన అంగన్ వాడీ టీచర్ తన వంతుగా పది వేల రూపాయల సహాయాన్ని ప్రకటించింది. ఆర్థిక సాయం మొత్తాన్ని జిల్లా సంక్షేమాధికారి శామ్యూల్ చేతుల మీదుగా అనీఫ్ కు అందజేశారు. ఈ సందర్భంగా డీడబ్ల్యూఓ మాట్లాడుతూ.. అనీఫ్ మళ్లీ మాములు మనిషిగా నడవాలంటే రెండు లక్షల రూపాయల వరకు ఖర్చవుతుందని, దాతలు ఎవరైనా సహాయం చేస్తే బాలునికి పునర్జన్మను ప్రసాదించిన వారవుతారని అన్నారు. అనీఫ్ కు సాయం చేసిన ఎన్నారైలలో బూరుగు యశ్వంత్ రెడ్డి, సౌరభ్, నాగరాజు, జీవన్ తేజ, రాంషా, విజయ్, అరవింద్, ఆదిత్య, ప్రశాంత్, నరసింహ, శ్రీకాంత్, అంగన్ వాడీ టీచర్ అరుణ ఉన్నారు. కార్యక్రమంలో ఇంచార్జ్ జిల్లా బాలల సంరక్షణ అధికారి వెంకటస్వామి, ఎల్సీపీఓ మొహినొద్దీన్, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ సునీల్ తదితరులు పాల్గొన్నారు.
నడుము పడిపోయిన యువకుడికి చేయూత
RELATED ARTICLES
Recent Comments