డాక్టర్ ప్రీతి ఇక లేరు..
సీనియర్ వేధింపులతో సూసైడ్ అటెంప్ట్
నిమ్స్ లో చికిత్స పొందుతూ మృతి
స్పాట్ వాయిస్, క్రైమ్ : సీనియర్ వేధింపులతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వరంగల్ కేఎంసీ పీజీ స్టూడెంట్ డాక్టర్ ప్రీతి కొద్ది సేపటి క్రితం మృతి చెందారు. నాలుగు రోజుల క్రితం వరంగల్ ఎంజీఎంలో డ్యూటీలో ఉండగానే డాక్టర్ ప్రీతి సూసైడ్ అటెంప్ట్ చేయగా, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్ కు తరలించారు. అప్పటి నుంచి డాక్టర్లు ప్రీతికి వెంటిలేటర్, ఎక్మోపైనే చికిత్స అందిస్తున్నారు. ప్రత్యేక వైద్య నిపుణులు సుమారు 72 గంటలకు పైగా ట్రీట్ మెంట్ చేసినా ఫలితం లేకపోయింది. కాగా, ఆదివారం ఉదయం నుంచి ప్రీతి ఆరోగ్యం అత్యంత విషమంగా మారిందని, ఆమె బతుకుతుందని ఆశ ఏమాత్రం లేదని ఆమె తండ్రి సురేంద్ర రెండు రోజులుగా చెబుతూనే ఉన్నారు.
Recent Comments