సర్పంచ్, యూత్ సభ్యుడి వేధింపులు..?
నర్సంపేట జిల్లా ఆస్పత్రికి తరలింపు ..
స్పాట్ వాయిస్, నర్సంపేట : సర్పంచ్, గ్రామ యూత్ సభ్యుడి వేధింపులు భరించలేక ఓ ఆశా వర్కర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.. స్థానికులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని బోటిమీది తండాకు చెందిన కునుసోతు నీలా బోటిమీది తండాతోపాటు నాజీతండాలో ఆశా కార్యకర్తగా పనిచేస్తోంది. రెండు, మూడు నెలలుగా నాజీతండా సర్పంచ్ బాలకిషన్, గ్రామ యూత్ సభ్యుడు శ్రీనివాసులు ఆశా వర్కర్ నీలా ను వేధిస్తున్నారు. వాళ్ల వేధింపులు భరించలేని నీలా శనివారం ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన స్థానికులు, కుటుంబసభ్యులు ఆమెను చికిత్స కోసం నర్సంపేట జిల్లా ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతోంది. అయితే ప్రస్తుతం ఆమె పరిస్థితి కాస్త ఆందోళన కరంగా ఉందని బాధితురాలి బంధువులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన సర్పంచ్, గ్రామ యూత్ సభ్యుడిపై చర్యలు తీసుకోవాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
Recent Comments