కేటిఆర్ పర్యటన నేపథ్యంలో ముందస్తు అరెస్టులు
స్పాట్ వాయిస్, భూపాలపల్లి టౌన్ : తెలంగాణ రాష్ట్ర ఐటీ , పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం, శంకుస్థాపన చేయడానికి గురువారం భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని క్రిష్ణకాలనీ అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంతరాలు చోటు చేసుకోకుండా భూపాలపల్లి నియోజకవర్గ స్థాయిలో పలు పార్టీల ముఖ్య నాయకులు, యూత్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్ లకు తరలిస్తున్నారు. అందులో భాగoగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ, ఎన్ఎస్యూఐ నాయకులు, బీజేవైఎం, సీపిఐ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
Recent Comments