యూత్ కాంగ్రెస్ నాయకుడిపై దాడి..
స్పాట్ వాయిస్, క్రైమ్: హన్మకొండ జిల్లా కాంగ్రెస్ యువనేత తోట పవన్ పై సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడిచేశారు. హన్మకొండ చౌరస్తాలో హాత్ సే హాత్ జోడో రేవంత్ యాత్రలో భాగంగా హన్మకొండ చౌరస్తా పరిధిలో జరిగినకార్నర్ మీటింగ్ కాంగ్రెస్ శ్రేణులు వేలాదిగా పాల్గొన్నారు. ఈ సభ అనంతరo రేవంత్ రెడ్డి కాన్వాయ్ కొద్దిదూరం పోయిన వెంటనే తోట పవన్ పై గుర్తు తెలియని వ్యక్తలు దారుణంగా దాడి చేశారు. ఆలస్యంగా గుర్తించిన తోటి కార్యకర్తలు ఆయన్ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన నగరంలో సంచలనంగా మారింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Video Player
00:00
00:00
Recent Comments