ఆందోళనకు దిగిన సాయన్న అభిమానులు
స్పాట్ వాయిస్, హైదరాబాద్: దివంగత ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని ఆయన అభిమానులు ఆందోళనకు దిగారు. అనారోగ్యంతో ఆదివారం కన్నుమూసిన ఎమ్మెల్యే సాయన్న అంతిమ సంస్కారాలు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో జరపాలని ఆయన అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. అభిమానుల ఆందోళన నేపథ్యంలో మారేడుపల్లి శ్మశానవాటికలో జరుగుతోన్న ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియలు నిలిచిపోయాయి. సాయన్న అంత్యక్రియల్లో పాల్గొన్న మంత్రులు అభిమానులను సముదాయించేందుకు ప్రయత్నించిన వారు వినకపోవడంతో శ్మశానవాటిక నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు వెళ్లిపోయారు. ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియలను అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించిన ప్రభుత్వం…అందుకు ఏర్పాట్లు చేయలేదు. దళిత ఎమ్మె్ల్యే కాబట్టే ప్రభుత్వం అధికారికంగా అంత్యక్రియలు చేయడం లేదని మండిపడ్డారు. 30 ఏండ్లు ప్రజలకు సేవ చేసిన ఎమ్మెల్యేను ఇలా అవమానించాలా అని ఆవేదన వ్యక్తం చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేకు అధికారికంగా అంత్యక్రియలు చేయరా అని ఫైర్ అయ్యారు.
నిలిచిన ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియలు
RELATED ARTICLES
Recent Comments