రైతు రుణమాఫీ ఘనత కాంగ్రెస్ పార్టీదే..
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
స్పాట్ వాయిస్, నల్లబెల్లి: రైతులకు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. హాత్ సే హాత్ జూడో యాత్రలో భాగంగా ఆదివారం కొండాయిల్ పల్లి , నల్లబెల్లి , లెంకలపల్లి గ్రామాలలో పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజనుల సమగ్ర అభివృద్ధికి తోడ్పడింది, ఫీజు రియాంబర్స్ మెంట్ కల్పించి దళిత బడుగు బలహీన గిరిజన వర్గాల ఉన్నత విద్యను అభ్యసించుటకు కృషి చేసిందిని చెప్పారు. టిఆర్ఎస్ బిజెపి ప్రభుత్వాలు మోసపూరితమేనని ఏ యొక్క వాగ్దానం నెరవేర్చలేదని అన్నారు. లంబాడీలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తానని, పోడు భూములకు పూర్తిస్థాయిలో పట్టాలిస్తానన్న కేసీఆర్ ధరణి పేరుతో దళిత గిరిజన లంబాడీల భూములను లాక్కునే ప్రయత్నంలోనే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందన్నారు. రైతులు పండించిన పంటలను సరైన సమయంలో కొనుగోలు చేయకుండా రైతులను గోస పెడుతున్నారని, ఒక బస్తా ధాన్యానికి తరుగు పేరుతో నాలుగు కిలోలు దోచుకుంటున్నారన్నారు. గత సంవత్సరం వడగండ్ల వానతో నష్టపోయిన రైతుల పంటలను పరిశీలించి పేపర్ ఫోజులు కొట్టారు తప్ప ఒరిగిందేమీ లేదని మండిపడ్డారు. రైతులకు సబ్సిడీ ఎరువులు విత్తనాలతో పాటు పనిముట్లు ఉచిత విద్యుత్ ఇచ్చామని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని రాజకీయాలకతీతంగా ప్రతి పేదవాడికి అందించామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి , కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Recent Comments