బీసీ గురుకులం విద్యార్థులకు అస్వస్థత
ఫుడ్ పాయిజన్ అంటూ వదంతులు..
వైరల్ ఫీవర్ కారణంగానే అంటున్న డాక్టర్, ప్రిన్సిపాల్.
స్పాట్ వాయిస్, నర్సంపేట: నర్సంపేట పట్టణంలోని వల్లబ్ నగర్ లో ఉన్న సోషల్ వెల్ఫేర్ గురుకుల హాస్టల్లో బుధవారం విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలోని 10 మంది విద్యార్థులు అస్వస్థత కు గురికాగా వెంటనే నర్సంపేటలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వారికి చికిత్స అందిస్తున్నారు. హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కారణంగానే విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారని వదంతులు వినిపించాయి. ఈ విషయమై ఆసుపత్రి వైద్యులను వివరణ కోరగా వైరల్ ఫీవర్ కారణంగానే విద్యార్థులు అసత్య గురయ్యారని విద్యార్థుల ఆరోగ్య విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు. ఇది ఇలా ఉంటే.. ఓకేసారి 10మందికి పైగా పిల్లలు అస్వస్థతకు గురి కావడం అనుమానాలకు తవిస్తోంది.
రెండు రోజుల నుంచి చికిత్స అందిస్తున్నాం..
ప్రిన్సిపల్ కుమారస్వామి
వాతావరణంలోని మార్పుల కారణంగానే విద్యార్థులకు విష జ్వరాల రావడంతో విద్యార్థుల అస్వస్థతకు గురయ్యారు. పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రిలో వారికి రెండు రోజులుగా చికిత్స అందించడం జరుగుతోంది. మంగళవారం ఆరుగురు విద్యార్థులకు జ్వరం రాగా ఆసుపత్రిలో వారికి చికిత్స అందించడం జరిగింది. నేడు మరో నలుగురికి కూడా జ్వరం రావడంతో ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. ఈ విషయమే విద్యార్థులు తల్లిదండ్రులకు కూడా సమాచారం అందించడం జరిగింది. ఫుడ్ పాయిజన్ కారణంగానే విద్యార్థులు అస్వస్థకు గురయ్యారనే వదంతులలో నిజం లేదు.
Recent Comments