Wednesday, April 9, 2025
Homeరాజకీయంనెలాఖరులోపు అసెంబ్లీ రద్దు..

నెలాఖరులోపు అసెంబ్లీ రద్దు..

నెలాఖరులోపు అసెంబ్లీ రద్దు..

ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి..

స్పాట్ వాయిస్, నల్లగొండ: ఈ నెలాఖరులోపు అసెంబ్లీ రద్దు అవుతుందని రాష్ట్రపతి పాలనలో.. ముందస్తు ఎన్నికలు వస్తాయని ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి జోస్యo చెప్పారు. సూర్యాపేట జిల్లా కోదాడలో జరిగిన కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణలో రాష్ట్రపతి పాలనలో ఎన్నికలు జరపాలని పార్లమెంట్‌లో లేవనెత్తుతామన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు పోలీసులు, రెవెన్యూ అధికారులు.. తొత్తులుగా మారుతున్నారని ఆరోపించారు. కోదాడలో 50వేల మెజార్టీ సాధించకపోతే రాజకీయ సన్యాసం చేస్తానంటూ సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ చేసిన సర్వేలో 25శాతం ఓటింగ్ లీడు లో ఉన్నామని చెప్పారు. రాహుల్ గాంధీ పాదయాత్రతో దేశం కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తుందన్నారు. దళితబంధులో అవకతవకలు జరగకుండా పారదర్శకంగా నిర్వహించాలని ప్రభుత్వానికి సూచించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments