Saturday, November 23, 2024
Homeలేటెస్ట్ న్యూస్అప్పులిచ్చినోళ్ల వేధింపులు.. వ్యాపారి సూసైడ్

అప్పులిచ్చినోళ్ల వేధింపులు.. వ్యాపారి సూసైడ్

వైరల్ అవుతున్న సెల్ఫీ వీడియో..
నన్ను క్షమించండి.. అమ్మను బాగాచూస్కోండి..
సూసైడ్ నోట్ లో వ్యాపారి విన్నపం
స్పాట్ వాయిస్, వరంగల్: బాలాజీ నగర్ కు చెందిన వ్యాపారి గంధం కుమారస్వామి (జీకే) సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యాపారంతో పాటు ఎన్నికల్లో ఆర్థిక నష్టపోయానని, అప్పులు బాధ పడలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వీడియోలో వెల్లడించాడు. సెల్ఫీ వీడియోలో ఉన్న ఆయన మాటల ప్రకారం…

‘2013-2014 వరకు బాగానే బతికాను. వ్యాపారంలో కోట్ల రూపాయలు నష్టపోయాను. పసుపు వ్యాపారంలో కొంత మంది నన్ను మోసం చేశారు. అలాగే జాగలు, ఇండస్ట్రీలు పోయినై. నా భార్య పిల్లలను కాపాడుకోవడాని ఏ చేయాలే తెలుస్తలేదు. 2021 సంవత్సరంలో టీఆర్ఎస్ నుంచి టీకెట్ రాకపోతే బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోయాను. దానికి అడిగొప్పుల సాంబేశ్వర్ తనకు డబ్బులు ఇచ్చాడు. ఓట్ల కోసం ఖర్చు పెట్టుకున్నాను. నేను ఓడిపోయాను. ఎన్నికల్లో ఆయన నాకు సహకరించి డబ్బులు ఇచ్చాడు. వాటిని ఎన్నికల్లో ఖర్చు చేసిన ఒక్క రూపాయి సొంతగా వాడుకోలేదు. అయితే ఇప్పుడతను నన్ను డబ్బుల కోసం ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. చంపుతానని బెదిరిస్తాండు. అందుకే వాళ్లు చంపడం కంటే.. నేనే చావలని నిర్ణయించుకున్నాను.’ వరంగల్ వ్యాపారి సెల్ఫీ సూసైడ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments