Saturday, November 23, 2024
Homeలేటెస్ట్ న్యూస్కేసీఆర్‌కు మరో పేరు పెట్టిన షర్మిల

కేసీఆర్‌కు మరో పేరు పెట్టిన షర్మిల

తీవ్ర ఆరోపణలు చేసిన వైఎస్సార్ టీపీ అధినేత
స్పాట్ వాయిస్, వరంగల్: బంగారు తెలంగాణ అంటూ బార్లు, బీర్ల తెలంగాణగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని వైఎస్సార్ టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. ఆదివారం షర్మిల పాదయాత్ర వరంగల్ పట్టణంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉద్యోగాలు లేక యువత ఆత్మహత్య చేసుటోందని ఆవేదన వ్యక్తం చేశారు. రుణాలు మాఫీ కాక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. కేసీఆర్ మారు పేరు 420.. కేసీఅర్ ఒక మోసగాడు అని తీవ్ర స్థాయిలో విమర్శించారు. సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మిమ్మల్ని తరిమి కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. ఇప్పటికైనా హామీలను నిలబెట్టుపెట్టుకోవాలని సూచించారు. కేసీఆర్ దిక్కుమాలిన పాలనలో రాష్ట్రంలో ఎనిమిదిన్నర వేలమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, అసెంబ్లీ సాక్షిగా మంత్రి కేటీఆర్ పచ్చి అబద్ధాలు చెబుతున్నారని షర్మిల మండిపడ్డారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments