అప్పు తీర్చమంటే హత్యచేశాడు..!
హన్మకొండ జిల్లాలో దారుణం
ఆలస్యంగా వెలుగు చూసి ఘటన
స్పాట్ వాయిస్, కాజీపేట: హన్మకొండ జిల్లాలోని కాజీపేటలో దారుణం చోటు చేసుకుంది. కడిపికొండ గ్రామంలో హత్య జరిగింది. కడిపికొండ గ్రామానికి చెందిన రైల్వే ఉద్యోగి జిర్ర ప్రదీప్ అదే గ్రామానికి చెందిన తన బంధువు రైల్వే ఉద్యోగి అయిన పెసరి వినయ్ కుమార్ కు అప్పు ఇచ్చాడు. గడువు ముగియడంతో తిరిగి ఇవ్వాలని అడగగా బుధవారం రాత్రి పెసరి వినయ్ గొడ్డలితో ప్రదీప్ పై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ప్రదీప్ ను కుటుంబ సభ్యులు నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
Recent Comments