ఇండ్లు కట్టించాలంటూ అడ్డగింత
స్పాట్ వాయిస్, భూపాలపల్లి: భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డికి నిరసన సెగ తగిలింది. బుధవారం నియోజకవర్గ పరిధి శాయంపేట మండల కేంద్రంలో పర్యటనకు వెళ్లిన ఆయనను రోడ్డు వెడల్పులో ఇండ్లు కోల్పోయిన బాధితులు అడ్డుకున్నారు. రోడ్డు వెడల్పులో గూడు కోల్పోయిన తమకు వేరే చోట ఇండ్లు మంజారు చేయాలని ప్లకార్డులతో ఆందోళన చేపట్టారు. గండ్రతో పాటు వరంగల్ జెడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి వాహనాన్ని అడ్డుకున్న న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిరసనకారులకు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇండ్లు కట్టించినంకనే ఎలక్షన్లకు పోదామని జెడ్పీ చైర్ పర్సన్ సర్ది చెప్పడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు.
ఎమ్మెల్యే గండ్ర దంపతులకు నిరసన సెగ
RELATED ARTICLES
Recent Comments