Sunday, April 6, 2025
Homeరాజకీయంబీఆర్ఎస్ లో భారీగా చేరికలు

బీఆర్ఎస్ లో భారీగా చేరికలు

బీఆర్ఎస్ పార్టీలో చేరిన పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు

స్పాట్ వాయిస్,   పరకాల: పరకాల నియోజకవర్గంలో చేరికల సందడి నెలకొంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు బీఆర్ఎస్ లో చేారారు.  ఆ కాంగ్రెస్ పార్టీ వైస్ ఎంపీపీ, సర్పంచ్, మాజీ సర్పంచ్, ఇతర సీనియర్ నాయకులు, యువజన నాయకులు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్ లో మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

చేరింది వీరే..
బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో… గీసుకొండ వైస్ ఎంపీపీ రడం శ్రావ్య భరత్, రాంపూర్ సర్పంచ్ గాజర్ల గోపి, మచ్చాపూర్ మాజీ సర్పంచ్ నమిండ్ల మానస, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పొలబోయిన గోవర్దన్, పొలబోయిన శ్రీనివాస్, అల్లం మర్రెడ్డి, కందికొండ రాజు, ఇట్టారి గురువయ్య, యూత్ లీడర్లు పొలెబోయిన సంపత్, గాజర్ల రంజిత్, పేర్ల శ్రవణ్, మంద అనిల్, పులి నాగేశ్, దండబోయిన సుమన్, పొలెబోయిన రాము తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments