Saturday, November 23, 2024
Homeలేటెస్ట్ న్యూస్28 నుంచి మళ్లీ షర్మిల యాత్ర

28 నుంచి మళ్లీ షర్మిల యాత్ర

ఆపిన చోటు నుంచే స్టార్ట్ చేస్తా..
అనుమతి ఇచ్చినా.. ఇవ్వకపోయినా మొదలుపెట్టుడే..
వెల్లడించిన వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు..
స్పాట్ వాయిస్, హైదరాబాద్: ప్రజా ప్రస్థాన యాత్రపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక ప్రకటన చేశారు. ఈ నెల 28 నుంచి యాత్ర తిరిగి ప్రారంభించనున్నట్లు చెప్పారు. పోలీసులు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా.. ఎక్కడైతే పాదయాత్ర ఆగిందో.. అక్కడి నుంచే మొదలు పెడతానని స్పష్టం చేశారు. తన పాదయాత్ర కేసీఆర్ పాలనకు అంతిమయాత్ర అవుతుందని షర్మిల అన్నారు. అన్నదాతలకు కేవలం రూ.5వేల రైతు బంధు ఇస్తున్న కేసీఆర్.. గతంలో వైఎస్సాఆర్ ఇచ్చిన రూ.30వేల లబ్ధిని ఆపేశారని షర్మిల మండిపడ్డారు. వైఎస్ తెచ్చిన ఆరోగ్య శ్రీ పథకానికి కేసీఆర్ తూట్లు పొడిచారని ఆరోపించారు. కేసీఆర్ 8ఏండ్ల పాలనలో ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని షర్మిల ఆరోపించారు. వైఫల్యాలను ఎండగడుతూ, అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే తపై దాడులు చేయిస్తున్నారని అన్నారు. తనకు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూడలేకనే తనపై దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. ప్రజల కోసం ఎన్ని దాడులనైనా భరిస్తానని షర్మిల స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే వైఎస్ షర్మిల పాదయాత్ర నర్సంపేట నియోజకవర్గంలో ఆగిన విషయం తెలిసిందే.

RELATED ARTICLES

Most Popular

Recent Comments