తెలంగాణలోనూ పోటీ చేస్తా..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్..
స్పాట్ వాయిస్, బ్యూరో: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్స్ చేశారు. పొత్తులపై ఎన్నికల సమయంలోనే నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. ఓట్లు చీలకూడదన్నదే తన అభిప్రాయమన్న ఆయన.. పొత్తులు కుదరకపోతే ఒంటరిగా ఎన్నికల బరిలో దిగుతామని స్పష్టం చేశారు. వైసీపీపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతోందని చెప్పారు. మంగళవారం కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుని వారహికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అభిమానులను ఉద్దేశించి పవన్ మాట్లాడారు. తెలంగాణ తనకు పునర్జన్మనిచ్చిందని చెప్పారు. కొండగట్టు అంజన్న ఆశీస్సులతో గతంలో ప్రమాదం నుంచి బయటపడిన విషయాన్ని గుర్తు చేశారు. భవిష్యత్ తరాల కోసం జనసేన తెలంగాణలోనూ పోటీ చేస్తుందని, సామాన్యులకు అండగా ఉంటుందని చెప్పారు. తెలంగాణ కళాకారుల రగిలించిన చైతన్యమే తన పోరాటానికి స్ఫూర్తి అని పవన్ అన్నారు. తుది శ్వాస వరకు తెలుగు రాష్ట్రాల ఐక్యత కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు. దుష్ట శిక్షణ కోసం అమ్మవారి పేరైన వారాహిని తన వాహనానికి పెట్టానని అన్నారు. జై తెలంగాణ నినాదంతో పవన్ తన ప్రసంగాన్ని ముగించారు.
పొత్తు ఉంటుంది.. కాని అప్పుడే నిర్ణయం..
RELATED ARTICLES
Recent Comments