Sunday, November 24, 2024
Homeతెలంగాణనయా సెక్రటేరియట్ ప్రారంభం.. ఫిబ్రవరి 17

నయా సెక్రటేరియట్ ప్రారంభం.. ఫిబ్రవరి 17

నయా సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్..
ఫిబ్రవరి 17న భవనాన్ని ప్రారంభించనున్న కేసీఆర్
హాజరు కానున్న జాతీయ స్థాయి నేతలు..
స్పాట్ వాయిస్, బ్యూరో : తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన నూతన సచివాలయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 17న ఉదయం 11:30 గంటలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దీనిని ప్రారంభించనున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించిన కొత్త సెక్రటేరియట్ కు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ పేరు పెట్టారు. అయితే ఈ సచివాలయ ప్రారంభోత్సవానికి జాతీయ నేతలను ఆహ్వానిస్తున్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్‌, జార్కండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌, బీహార్‌ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌, బీఆర్‌ అంబేద్కర్‌ మనవడు ప్రకాష్‌ అంబేద్కర్‌ తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులు కూడా హాజరుకానున్నట్లు బీఆర్ ఎస్ నేతలు తెలిపారు. అయితే ప్రారంభోత్సవానికి ముందు సీఎం కేసీఆర్ వాస్తుపూజ, చండీయాగం, సుదర్శనయాగం నిర్వహించనున్నారని, ఆ తరువాత పరేడ్‌ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు సమాచారం.
సచివాలయాన్ని పరిశీలించిన కేసీఆర్
సచివాలయం ప్రారంభం నేపథ్యంలో సీఎం కేసీఆర్ పనుల పురోగతిని పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరు తెలుసుకొని పలు సూచనలు సలహాలు ఇచ్చారు. సీఎం వెంట మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, అధికారులు, తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments