Sunday, November 24, 2024
Homeజాతీయంనేను పెళ్లి చేసుకుంటా..

నేను పెళ్లి చేసుకుంటా..

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
స్పాట్ వాయిస్, బ్యూరో: పెళ్లి విషయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. మంచి అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకుంటానని చెప్పారు. తాను పెళ్లికి వ్యతిరేకం కాదన్న 52 ఏళ్ల రాహుల్.. తెలివైన అమ్మాయి దొరికితే చాలన్నారు. తన తల్లిదండ్రులది ప్రేమ వివాహమైనందున అమ్మాయి విషయంలో అంచనాలు చాలానే పెట్టుకుంటానని అన్నారు. ఆయన బాల్యం, విద్యాభ్యాసం ఎలా గడిచింది..? పెళ్లి గురించి అసలు ఎలాంటి ఆలోచన ఉంది..? లాంటి కీలక విషయాల గురించి తెలుసుకోవాలని చాలా మందికి ఆసక్తిగా ఉంటుంది. అలాంటి వాటన్నింటి గురించి రాహుల్ గాంధీ రాజస్థాన్‌లో భారత్ జోడో యాత్ర జరుగుతున్న సమయంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇప్పుడా అంశాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గతంలోనూ రాహుల్ పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. నాన్నమ్మ ఇందిరా గాంధీ నైజం.. అమ్మ సోనియా గాంధీ సుగుణాలతో కూడిన అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకుంటానని అన్నారు. నాయనమ్మ అంటే తనకు ఎంతో ప్రేమ అని చెప్పిన రాహుల్.. తనకు ఆమె మరో మాతృమూర్తి అన్నారు. నాన్ వెజ్ అంటే ఇష్టమన్న రాహుల్ గాంధీ.. తెలంగాణ ఫుడ్ స్పైసీగా ఉంటుందన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments