Sunday, November 24, 2024
Homeతెలంగాణబీఆర్ఎస్ కార్పొరేటర్ అరెస్ట్..

బీఆర్ఎస్ కార్పొరేటర్ అరెస్ట్..

బీఆర్ఎస్ కార్పొరేటర్ అరెస్ట్..
గ్రేటర్ వరంగల్ లో కలకలం..
ఖమ్మం జైలుకు వేముల శ్రీనివాస్
నిందితుడు చీఫ్ విప్ దాస్యంకు అంత్యంత సన్నిహితుడు
స్పాట్ వాయిస్, హన్మకొండ : గ్రేటర్ వరంగల్ లో అధికార పార్టీకి భారీ కుదుపు. ల్యాండ్ కబ్జా ఆరోపణల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఏడో డివిజన్ కార్పొరేటర్‌ వేముల శ్రీనివాస్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. భూ కబ్జాల నేపథ్యంలో బాధితుల ఫిర్యాదు మేరకు నాన్​బెయిలబుల్​ కేసులు నమోదు చేసిన పోలీసులు శనివారం సెకండ్ అడిషనల్​జ్యుడిషియల్ ఫస్ట్​ క్లాస్​మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచి ఖమ్మం జైలుకు తరలించారు. వివరాలిలా ఉన్నాయి.. హన్మకొండ కాకతీయ కాలనీ ఫేజ్–2లోని 200 గజాల స్థలాన్ని బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఏడో డివిజన్ కార్పొరేటర్ వేముల శ్రీనివాస్​డెవలప్​మెంట్ పేరుతో తమకు అప్పగించాల్సిందిగా ల్యాండ్​ ఓనర్​ సునీత దంపతులను హెచ్చరించాడు. వాళ్లు నో చెప్పడంతో.. తన అనుచరులతో కలిసి ల్యాండ్​మీదికి వెళ్లి కాంపౌండ్​వాల్​ను కూల్చేశాడు. అయితే తమను బెదిరించడంతోపాటు ఆస్తి ధ్వంసం చేయడంతో బాధితులు నాలుగు రోజుల క్రితం హన్మకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణ అనంతరం సీపీ ఏవీ రంగనాథ్​ఆదేశాలతో కార్పొరేటర్​వేముల శ్రీనివాస్​తో పాటు అతడి డ్రైవర్​పడాల కుమారస్వామిపై ఐపీసీ 427, 447, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో శనివారం నిందితులకు వైద్య పరీక్షల అనంతరం హనుమకొండ సెకండ్​ జేఎఫ్​సీఎం ముందు హాజరు పరిచి, మేజిస్ట్రేట్​ఆదేశాలతో ఖమ్మం జైలుకు తరలించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments