13న తెలంగాణకు మోడీ
ఫిక్స్ అయిన షెడ్యూల్
స్పాట్ వాయిస్, హైదరాబాద్: తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటన ఖరారైంది. ఫిబ్రవరి 13న మోడీ హైదరాబాద్ కు రానున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత పరేడ్ గ్రౌండ్స్ లో జరగనున్న బీజేపీ భారీ బహిరంగ సభలో పాల్గొనున్నారు. సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ రైలును ప్రారంభించడానికి ఈ నెల 19నే మోడీ తెలంగాణలో పర్యటించాల్సి ఉంది. కానీ అనివార్య కారణాల వల్ల టూర్ క్యాన్సిల్ అయ్యింది. దీంతో అనుకున్న టైం కంటే ముందే ఈ నెల 15న సికింద్రాబాద్- వైజాగ్ వందేభారత్ రైలును మోడీ వర్చువల్‌గా ప్రారంభించారు. దీంతో ఇప్పుడు మోడీ టూర్ ఖరారైంది. తాజాగా ఫిక్సయిన టూర్ లో ప్రధాని రూ.7వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.
సభాపైనే ఫోకస్..
ప్రధాని రాక సందర్భంగా పరేడ్ గ్రౌండ్ లో సభ ఏర్పాటు చేస్తున్నారు. పార్టీ సభ కావడంతో మోడీ ఏం మాట్లాడతారా? అనే ఉత్కంఠ నెలకొంది. మొన్నే బీఆర్ఎస్ ఆవిర్భావ సభ జరిగింది. ఖమ్మం గడ్డపై బీజేపీపై సమరశంఖం పూరించింది బీఆర్ఎస్. ఈ సభలో సీఎం కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే.. సభకు హాజరైన జాతీయ నేతలు కూడా విమర్శనాస్త్రాలు సంధించారు. ఇప్పుడు మోడీ బీజేపీ సభలో ఆ కామెంట్స్ కు కౌంటర్స్ ఇస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.
Recent Comments