స్పాట్ వాయిస్, క్రైం: మావోయిస్టు అగ్ర నేత హిడ్మా గ్రేహౌండ్స్ బలగాల చేతిలో ఎన్ కౌంటర్ అయ్యాడు. బీజాపూర్, తెలంగాణ సరిహద్దుల్లో మావోయిస్టు లకు పోలీసులు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో హిడ్మా చనిపోయినట్టు అధికారులు తెలిపారు. అడవిలో దాక్కున్నాడని పక్కా సమాచారంతో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. పోలీసుల రాకను గుర్తించిన మావోయిస్టులు కాల్పులు జరిపారు. వీరికి దీటుగా పోలీసులు ఎదురుకాల్పులు జరపడంతో హిడ్మా మృతి చెందాడు. ప్రస్తుతం మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్న హిడ్మాపై లక్ష రూపాయల రివార్డ్ ఉంది.
మాస్టర్ మైండ్..
తెలంగాణ గ్రేహౌండ్స్, సీఆర్పీఎప్ కోబ్రా ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ చేపట్టినట్టు సమాచారం. 40 ఏళ్ల లోపు వయసున్న హిడ్మాకు మావోయిస్టుల్లో మాస్టర్ మైండ్‌గా గుర్తింపు ఉంది. 17 ఏండ్లకే మావోయిస్టుల్లో చేరిన హిడ్మా.. కొద్దికాలానికే కేంద్ర కమిటీ స్థాయికి చేరుకున్నట్టు చెబుతారు. హిడ్మాను ఇంగ్లీష్‌తో పాటు గిరిజన మాండలికాలు, దేశంలోని అనేక ప్రాంతీయ భాషల్లో నిష్ణాతుడని చెబుతారు. హిడ్మా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా బెటాలియన్ నంబర్ వన్‌కు నాయకత్వం వహిస్తున్నాడు. 21 మంది సభ్యులున్న మావోయిస్టు కేంద్ర కమిటీలో హిడ్మా అతి చిన్న వయస్కుడు.
Recent Comments