నేడు రేపు ఉత్తర్వులు జారీ చేయనున్న సర్కార్
ప్రస్తుతం ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్న రామకృష్ణరావు
పరిశీలనలో అరవింద్ కుమార్, రజత్ కుమార్ పేర్లు..!
12వ తేదీలోపు సోమేశ్ కుమార్ రిలీవ్ కావాలని డీవోపీటీ ఆదేశాలు
స్పాట్ వాయిస్, ప్రధానప్రతినిధి: సీఎస్ సోమేశ్ కుమార్ ను ఏపీకి కేటాయించాలని హైకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో తెలంగాణ కొత్త సీఎస్ ఎవరనే చర్చ మొదలైంది. హైకోర్టు తీర్పు అనంతరం సీఎస్ సోమేశ్ కుమార్ సీఎంతో సమావేశమయ్యారు. ఇదిలా ఉంటే.. సీఎస్ సోమేశ్ కుమార్ కు డీవోపీటీ తెలంగాణ నుంచి రిలీవ్ కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 12వ తేదీలోపు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని సూచించింది. ఈ నేపథ్యంలో కొత్త సీఎస్ నియామకంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ప్రస్తుతం ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్న రామకృష్ణరావును నియమించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా సీనియర్ల లిస్టులో ఉన్న అరవింద్ కుమార్, రజత్ కుమార్ పేర్లను సైతం సీఎస్ నియామకం కోసం పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు నేడో, రేపో ఉత్తర్వులు జారీ కానున్నాయని తెలుస్తోంది.
తెలంగాణ కొత్త సీఎస్ గా రామకృష్ణరావు..?
RELATED ARTICLES
Recent Comments