కీలక తీర్పునిచ్చిన హైకోర్టు
స్పాట్ వాయిస్, హైదరాబాద్: తెలంగాణలో సీఎస్ సోమేష్ కుమార్ కేటాయింపును హైకోర్టు రద్దు చేసింది. సీఎస్ సోమేష్ కుమార్ క్యాడర్ కేటాయింపు వివాదంపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ ఉత్తర్వులను కొట్టివేసింది. రాష్ట్ర విభజనప్పుడు సోమేష్ కుమార్ ను కేంద్రం ఏపీకి కేటాయించింది. అయితే కేంద్రం ఉత్తర్వులు నిలిపివేసి తెలంగాణలో కొనసాగేలా గతంలో క్యాట్ ఉత్తర్వులు జారీ అయ్యాయి. క్యాట్ మధ్యంతర ఉత్తర్వులతో సోమేష్ కుమార్ తెలంగాణలో సీఎస్ గా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో 2017లో కేంద్రం మధ్యంతర ఉత్తర్వులు కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించారు. క్యాట్ ఉత్తర్వులు కొట్టివేస్తూ సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ బెంచ్ తీర్పు ఇచ్చింది.
సోమేష్ కుమార్ న్యాయవాది అభ్యర్థన మేరకు తీర్పు అమలను 3 వారాలు నిలిపివేసింది.
సీఎస్ సోమేశ్ కుమార్ కేటాయింపు రద్దు..
RELATED ARTICLES
Recent Comments