Friday, September 20, 2024
Homeజిల్లా వార్తలుపార్టీకి బూత్ కమిటీలే కీలకం..

పార్టీకి బూత్ కమిటీలే కీలకం..

పార్టీకి బూత్ కమిటీలే కీలకం

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

స్పాట్ వాయిస్, నర్సంపేట : పార్టీకి బూత్ కమిటీలే కీలకమని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. శనివారం నర్సంపేట పట్టణ కేంద్రంలోని ద్వారకపేట రోడ్ లోని ఎంఏఆర్ గార్డెన్ లో బీజేపీ నియోజకవర్గ బూత్ స్థాయి కార్యకర్తల సమ్మేళనం రేవూరి ప్రకాష్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ బూత్ స్థాయి సమ్మేళనంలో ఏర్పాటుచేసిన ఎల్ఈడి స్క్రీన్ ద్వారా వర్సువల్ విధానంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సరళ్ యాప్ ను ప్రారంభించారు. అనంతరం బండి సంజయ్, కేంద్రమంత్రి జీ కిషన్ రెడ్డిలు మాట్లాడుతూ బూత్ స్థాయి కమిటీల ప్రాముఖ్యతను వివరించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి వచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోడీ జాతీయ అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా సారథ్యంలో ఏ విధంగా ప్రతి కార్యకర్త పనిచేయాలో వివరంగా వర్చువల్ విధానంలోనే పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి గారు మాట్లాడుతూ బూత్ కమిటీలు బలంగా ఉంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణలో బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకోవడం ఖాయమని
తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతి కుటుంబ పాలనను అంతం చేయాలన్నదే బిజెపి లక్ష్యమని మిషన్ 90లో భాగంగా పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా సారధ్యంలో నియోజకవర్గ బూత్‌ స్థాయి సమ్మేళనాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సమ్మేళనం ద్వారా బూత్ కమిటీ అధ్యక్షుడు సభ్యులు రాజకీయ అవగాహనతో ప్రజలతో సత్సంబంధాలను పెంచుకొని కష్టపడి పనిచేస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణలో బిజెపి అధికారాన్ని కైవసం చేసుకోవడం ఖాయమన్నారు. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం కెసిఆర్ పాలనలో ఆబాసుపాలైనదని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సుమారు 1300 మంది యువకులు ఆత్మ బలిదానం చేసుకొన్నారన్నారు. వారి ఆత్మ బలిదానాలతో వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ కుటుంబ పాలనలో మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ నేడు అప్పుల రాష్ట్రంగా మార్చారని రాష్ట్ర వనరులను కెసిఆర్ కుటుంబం అందినంత దోచుకున్నారని కేసీఆర్ అవినీతి మోసపూరిత విధానాలు అప్రజాస్వామిక పాలన పట్ల అన్ని వర్గాల ప్రజలు విసిగి వేసారి పోయారని తెలిపారు. తెలంగాణ ప్రజలు బీజేపీ పాలను కోరుకుంటున్నారని అది గ్రహించిన కేసీఆర్, టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి బీజేపీ, బీఆర్ఎస్ లో ప్రజలలో గందరగోళం సృష్టించి తిరిగి అధికారంలోకి రావాలని పగటి కలలు కంటున్నారన్నారు. ఇప్పటినుండే ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బూత్ కమిటీ సభ్యుల్లో అవగాహన పెంచాలన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని వారికి రేవూరి ప్రకాశ్ రెడ్డి పిలుపునిచ్చారు.

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments