Wednesday, April 16, 2025
Homeజనరల్ న్యూస్ప్రేమలేదని.. ప్రియురాలు లేదని...

ప్రేమలేదని.. ప్రియురాలు లేదని…

లోకం వీడిన ప్రియుడు
జనగామ జిల్లాలో విషాదం
స్పాట్ వాయిస్, జనగామ : ఆమె మరణంతోనే నేను కూడా అంటూ ప్రాణం విడిచాడు ప్రియుడు. ఈ విషాద ఘటన జనగామ మండలం వెంకిర్యాలలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఇరుగు అరవింద్ తల్లిదండ్రులు కొన్నాళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందారు. ఈ బాధతోనే జీవితాన్ని సాగిస్తున్న అతడికి వడ్లకొండ గ్రామానికి చెందిన కావేరి పరిచయమైంది. అది కాస్త ప్రేమగా మారింది. కొన్నాళ్లకు వీరి ప్రేమ విషయం యువతి తల్లిదండ్రులకు తెలిసింది. వారు మందలించినా.. ప్రేమను మాత్రం వదలుకోలేకపోయారు. తన ఇష్టాన్ని తల్లిదండ్రులు కాదన్నారని గత నెల 25న కావేరి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆగ్రహించిన కావేరి తల్లిదండ్రులు అరవింద్ ఇంటికి వెళ్లి గొడవ చేశారు. పోలీసు స్టేషన్ లో సైతం ఫిర్యాదు చేశారు. దీంతో మనస్తాపానికి గురైన యువకుడు మరుసటి రోజు పురుగులు మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. అపస్మారక స్థితికి చేరిన అతడిని జనగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ తరలించగా.. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments