Thursday, December 5, 2024
Homeలేటెస్ట్ న్యూస్వరంగల్ లో బైరీ నరేశ్ అరెస్ట్

వరంగల్ లో బైరీ నరేశ్ అరెస్ట్

కొడంగల్ తరలించే ఛాన్స్
అయ్యప్పపై అనుచిత వ్యాఖ్యలు..
మండిపడుతున్న స్వాములు
స్పాట్ వాయిస్, కమలాపూర్: అయ్యప్పస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓయూ విద్యార్థి, నాస్తిక సంఘం అధ్యక్షుడు భైరి నరేష్‌ను వరంగల్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల కొడగల్‌లో జరిగిన ఓ సభలో బహిరంగంగా అయ్యప్పస్వామిపై భైరి నరేష్ అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. బహిరంగ సభలో అందరి ముందు అయ్యప్పస్వామిని కించపరుస్తూ దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలపై అయ్యప్పస్వాములు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా నరేష్‌పై 16 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. ఈ క్రమంలో గాలింపు చర్యలు చేపట్టి పరారీలో ఉన్న భైరి నరేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా భైరి నరేష్‌ను ట్రేస్ చేసిన పోలీసులు.. కమలాపూర్‌లోని ఓ హోటల్‌లో నరేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాసేపట్లో భైరి నరేష్‌ను కొడంగల్‌కు పోలీసులు తరలించనున్నారు. భైరి నరేష్ అరెస్ట్‌పై వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి ప్రకటన విడుదల చేశారు. నరేష్‌పై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, అయ్యప్పస్వాములు ఆందోళనలు విరమించాలని ఎస్పీ కోరారు. భైరి నరేష్‌ను అరెస్ట్ చేయాలని రెండు రోజులుగా అయ్యప్పస్వాములు ఆందోళణలు చేస్తుండటంతో.. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శుక్రవారం అయ్యప్పస్వాములు ఆందోళనలు చేస్తున్న క్రమంలో.. దానిని వీడియో చిత్రీకరించడానికి వచ్చిన భైరి నరేష్‌ అనచరుడు బాలరాజును చితకబాదారు. అయ్యప్పస్వాముల దాడిలో గాయపడిన బాలరాజును పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉందని తెలుస్తోంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments