Wednesday, November 27, 2024
Homeజిల్లా వార్తలురాబోయే ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి

రాబోయే ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి

రాబోయే ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి

బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కంభంపాటి ప్రతాప్

స్పాట్ వాయిస్ నర్సంపేట, ఖానాపురం : భవిష్యత్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కంభంపాటి ప్రతాప్ అన్నారు. గురువారం మండలంలోని బుధరావుపేటలో ఐదు బూతుల నుండి అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. పార్టీ మండల కన్వీనర్ జల్లి మధు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఉపాధ్యక్షుడు, ఖానాపూర్ మండల ఇన్చార్జ్ కంభం పాటి ప్రతాప్ హాజరై మాట్లాడారు. బూత్ స్థాయి నుండి కమిటీలను పున:నిర్మాణం చేస్తూ భవిష్యత్తులో జరిగే కేంద్ర రాష్ట్ర ఎన్నికలకు సంసిద్ధంగా ఉండాలన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బూత్ కమిటీలే ప్రధాన పాత్ర పోషిస్తాయని ఆయన తెలిపారు. ప్రతి బూతు స్థాయి కార్యకర్త ఆ బూతులో ఉన్న అందరినీ కలుస్తూ అందుబాటులో ఉండాలన్నారు. సమన్వయంతో పనిచేస్తేనే మంచి ఫలితాలు వస్తాయని వచ్చే ఎన్నికల్లో నర్సంపేటలో రేవూరి ప్రకాష్ రెడ్డి నాయకత్వాన్ని బలపరిచి బీజేపీ జెండా ఎగురవేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ మోర్చా ఉపాధ్యక్షుడు షేక్ ఖాసిం, జిల్లా మైనార్టీ మోర్చా సెక్రటరీ షేక్ సలీం, ఓబీసీ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి చిట్యాల దయాకర్, మైనార్టీ మండల మోర్చా అధ్యక్షులు షేక్ ఖలీల్, ఉపాధ్యక్షుడు రహిమాన్, బూతు అధ్యక్షులు బత్తిని సునీల్, కొమ్ము రాములు, గుండ్రపల్లి శీను, బీజేవైఎం ఉపాధ్యక్షులు పసునూరి భరత్, సీనియర్ నాయకులు ఓరుగంటి పుల్లయ్య, యువ నాయకులు ఆకుల సందీప్, గద్దల శంకర్, చెడిపాక రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments