ఒకే యువతికి రెండు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
ఆనందం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు, గ్రామస్తులు
స్పాట్ వాయిస్ నర్సంపేట, (ఖానాపురం ): ఖానాపురం మండలంలోని బుధరావుపేట గ్రామానికి చెందిన యువతి రెండు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. గ్రామ సర్పంచ్, మండల సర్పంచుల ఫోరమ్ అధ్యక్షుడు కాస ప్రవీణ్ కుమార్ కు ఇద్దరు కుమార్తెలు కాగా.. పెద్ద కుమార్తె హరిప్రియ 2019 స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎంట్రన్స్ ఫలితాల్లో ప్రతిభ కనబరిచి ఇన్ కం టాక్స్ డిపార్ట్మెంట్ లో ఇన్స్పెక్టర్ ఉద్యోగం సాధించి ఉద్యోగంలో చేరింది. ఇటీవల వెలువడిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 2020 ఎంట్రన్స్ లో కస్టమ్స్ డిపార్ట్మెంట్ లో ప్రివెంటివ్ ఆఫీసర్ గా రెండవ ఉద్యోగం సాధించింది. రెండవ కుమార్తె ఇప్పటికే ఎంబీబీఎస్ లో ఫ్రీ సీటు సాధించి చదువుతోంది. తమ గ్రామానికి చెందిన యువతి రెండు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించించడంతో ఆమె తల్లిదండ్రులు గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Recent Comments