Sunday, November 24, 2024
Homeతెలంగాణతెలంగాణ అప్పు.. రూ.3,12,191 కోట్లు

తెలంగాణ అప్పు.. రూ.3,12,191 కోట్లు

ఐదేళ్లలో 94.75 శాతం పెరుగుదల
వెల్లడించిన కేంద్ర ఆర్థిక శాఖ
స్పాట్ వాయిస్, హైదరాబాద్: తెలంగాణ రోజురోజుకు అప్పుల పాలవుతోంది. రాష్ర్టంలో అప్పుల భారం ఏటా పెరుగుతోందని స్వయంగా కేంద్రం వెల్లడించింది. ఐదేళ్లలో రాష్ట్ర అప్పులు 94.75 శాతం పెరిగినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వివరించింది. 2018లో రూ.1,60, 96.3 కోట్ల వరకు ఉన్న అప్పులు.. 2022 నాటికి రూ.3,12,191.3 కోట్లకు చేరినట్లు పేర్కొంది. 2017-2018లో గతేడాదితో పోలిస్తే 18.7 శాతం అప్పులుంటే.. 2021-22నాటికి 16.7 శాతం ఉన్నట్లు స్పష్టం చేసింది. రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో మూడేళ్లుగా అప్పుల శాతం పెరుగుతూ పోతోందని కేంద్రం పేర్కొంది. 2016లో రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో అప్పుల శాతం 15.7 ఉండగా.. ఆ తర్వాత భారీగా పెరుగుదల ఉన్నట్లు ఆర్థికశాఖ లెక్కల్లో వెల్లడైంది. 2022 నాటికి రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో 27.4 శాతం అప్పులు నమోదైనట్లు వివరించింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments