వచ్చే ఏడాది కేతమ్మ, మేడమ్మలకు కిలో స్వర్ణ కిరీటం
మొక్కుకున్న మంత్రి హరీశ్ రావు..
స్పాట్ వాయిస్, జనగామ: కొమురవెల్లి మల్లన్నకు మంత్రి హరీశ్ రావు ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలతో పాటు రూ. కోటి విలువైన బంగారు కిరీటాన్ని సమర్పించారు. ఆదివారం మల్లన్న కల్యాణం వైభవంగా నిర్వహించనున్న నేపథ్యంలో మంత్రి బంగారు కిరీట అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. కొమురవెల్లి మల్లన్న మన కొంగు బంగారమని, రాష్ట్రానికే తలమానికం మల్లన్న జాతర అని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆలయాలకు నిధులు మంజూరు చేస్తూ.. పురాతన ఆలయాలకు పూర్వ వైభవం తెస్తున్నారని మంత్రి వెల్లడించారు. వచ్చే ఏడాది మల్లన్న స్వామి కల్యాణం వరకు కేతమ్మ, మేడమ్మల అమ్మవార్లకు ఒక కిలో స్వర్ణ కిరీటం తయారు చేయిస్తామని మంత్రి ప్రకటించారు.
Recent Comments