స్పాట్ వాయిస్, కరీంనగర్: జిల్లాలో ఓ యువకుడు ట్రాన్స్ జెండర్ ను పెళ్లి చేసుకున్నాడు. జమ్మికుంటలో నివసిస్తున్న ట్రాన్స్ జెండర్ దివ్యను.. జగిత్యాలకు చెందిన అర్షద్ అనే యువకుడు శుక్రవారం వివాహం చేసుకున్నాడు. ఇంట్లో పెద్దలు అంగీకరించకపోయినా..తాము ఒకరికొకరం తోడుగా కలిసి జీవించాలని నిర్ణయించుకుని సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. తనతో జీవితాంతం తోడుగా ఉంటానని అర్హద్ చెప్పడంతో తన ప్రేమను కాదనలేకపోయానని దివ్య చెప్పారు. పెళ్లి అనంతరం దైవ దర్శనం కోసం ఇల్లంతకుంట శ్రీ సీతారామ చంద్రస్వామి ఆలయ దర్శనానికి జంటగా వచ్చారు.
Recent Comments