అందుకే రాజీనామా చేస్తున్న..
మాజీ మంత్రి కొండా సురేఖ
స్పాట్ వాయిస్, హన్మకొండ: టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీపై కొండా సురేఖ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ కమిటీకి ఆమె రాజీనామా చేశారు. పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో తన పేరు లేదని, తన కంటే జూనియర్లకు స్థానం కల్పించారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పీసీసీ కమిటీలో తన పేరు లేకపోవడం అవమానించడమేనని, అందుకే ఎగ్జిక్యూటివ్ కమిటీకి రాజీనామా చేస్తున్నట్లు కొండా సురేఖ తెలిపారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని, పార్టీ మారుతున్నారనే వార్తలను నమ్మొదని కొండా సురేఖ చెప్పారు. కేవలం తాను ఏఐసీసీ ప్రకటించిన జనరల్ సెక్రటరీ పదవికి మాత్రమే రాజీనామా చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు.
Recent Comments