పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
70 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
స్పాట్ వాయిస్, దామెర/ సంగెం: సీఎం కేసీఆర్ పేదల పాలిట ఆపద్బాంధవుడని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఆదివారం హనుమకొండలోని ఆయన నివాసంలో పరకాల మున్సిపాలిటీ, పరకాల, నడికూడ, ఆత్మకూర్, దామెర, సంగెం మండలంతో పాటు గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ పరిధిలోని 70 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వం పేదల పక్షపాతి అని, సీఎం కేసీఆర్ పేదల సంక్షేమానికి కృషి చేస్తున్నారని తెలిపారు. అనారోగ్యానికి గురై దవాఖానల్లో చికిత్స పొందుతున్న అర్హులైన ప్రతి ఒక్కరికీ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్థిక సాయం అందజేస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు నిరుపేద కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తున్నాయన్నారు. ప్రజా సంక్షేమంలో తెలంగాణ అగ్రగామిగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ, మండల ముఖ్య నాయకులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
మండలాల వారీగా లబ్ధిదారులు..
పరకాల మున్సిపాలిటీ(8)- 2,18,000/-
పరకాల మండలం(7)- 2,44,500/-
నడికుడా మండలం(7)- 2,93,000/-
ఆత్మకూరు మండలం(6)- 1,74,500/-
దామెర మండలం(7)- 1,61,000/-
సంగెం మండలం(15)- 7,44,500/-
జీడబ్ల్యూఎంసీ (12)- 3,77,500/-
Recent Comments