Sunday, September 29, 2024
Homeక్రైమ్కూలీలతో వెళ్తున్న ఆటోకు యాక్సిడెంట్

కూలీలతో వెళ్తున్న ఆటోకు యాక్సిడెంట్

పలువురికి తీవ్ర గాయాలు
భూపాలపల్లి జిల్లాలో ప్రమాదం
స్పాట్ వాయిస్, రేగొండ: జయశంకర్ భూపాలపల్లి రేగొండ మండలంలోని చెన్నాపురం వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కూలీలతో వెళ్తున్న ఆటోకు యాక్సిడెంట్ కావడంతో కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. కూలీలను తీసుకుని వెళ్తున్న ఆటో- కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆటో రోడ్డు పక్కన ఉన్న పొలాల్లో పడిపోయింది. ప్రమాదంలో పలువురు గాయపడగా.. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కూలీల రోదనలతో ఆ ప్రాంతమంతా విషాదంగా మారింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments