జగిత్యాల నుంచి జైత్రయాత్ర..
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
స్పాట్ వాయిస్, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో జగిత్యాల అభివృద్ధి జరిగిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. టీఆర్ఎస్ జైత్ర యాత్ర జగిత్యాల నుంచే ప్రారంభమైందని, సీఎం ఆ జైత్రయాత్రకు మళ్లీ రావడం సంతోషంగా ఉందని ఆమె చెప్పారు.హైదరాబాద్ లోని తన నివాసం నుంచి బుధదవారం జగిత్యాలకు బయలుదేరే ముందు ఆమె మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి సందేశం కోసం మేమంతా వెయిట్ చేస్తున్నాం అంటూ కవిత చెప్పారు. సీఎం కేసీఆర్ తో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆమె పాల్గొననున్నారు. బీఆర్ఎస్ ఫలితం త్వరలోనే వస్తుందని కవిత ఆశాభావం వ్యక్తంచేశారు.
జగిత్యాలలో బహిరంగ సభ
జగిత్యాలలో బుధవారం భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభావేదికగా.. ఎమ్మెల్సీ కవితకు ఇచ్చిన నోటీసులు, ఢిల్లీ లిక్కర్ స్కాంపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు ఉంటాయని టీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నారు. అలాగే బీఆర్ఎస్ అంశంపై కూడా సీఎం స్పందిస్తారని పేర్కొంటున్నారు. నేటితో బీఆర్ ఎస్ పేరు మార్పుపై బహిరంగ ప్రకటనకు గడువు ముగిసింది. అయితే బీఆర్ఎస్ పై ఎన్నికల సంఘం ఇప్పటి వరకూ స్పందించలేదు. ఈ క్రమంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు చెబుతున్నారు.
Recent Comments