వైఎస్ షర్మిలకు ప్రధాని మోడీ ఫోన్..
స్పాట్ వాయిస్, హైదరాబాద్: తెలంగాణ రాజకీయం కీలక మలుపు తిరిగింది. ఇప్పటికే రాజకీయం వేడెక్కగా.. వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఫోన్ చేసి పరామర్శించారు. తాజా పరిణామాలపై చర్చించారు. ఇటీవల జరిగిన ఘటనలకు ఆయన సానుభూతి తెలిపి.. ఢిల్లీకి రావాలంటూ సూచించారు. ఒక మహిళ అని చూడకుండా.. కారులో ఉండగానే తీసుకువెళ్లడం అనేది దారుణమని అన్నారు. ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. అంతేకాకుండా ఆ ఘటనను చూసి చాలా బాధపడ్డానన్నారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని మోడీ అన్నారు. షర్మిలతో ప్రధాని సుమారు 10 నిముషాలు మాట్లాడారు. ఇదిలా ఉంటే మంగళవారం
జీ-20 (G-20) సమావేశంలో పాల్గొన్న ఏపీ సీఎం జగన్ వద్ద కూడా ప్రధాని మోడీ ఈ విషయాన్ని ప్రస్తావించారు. తెలంగాణలో పాదయాత్ర చేస్తున్న వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల వాహనంపై వరంగల్ జిల్లా నర్సంపేటలో గత ఆదివారం రాళ్ల దాడి జరిగిన విషయం తెలిసిందే.
తెలంగాణ రాజకీయంలో కీలక మలుపు
RELATED ARTICLES
Recent Comments