సీఎం కూతురికి సీబీఐ నోటీసులు
6న విచారణకు హాజరు కానున్న ఎమ్మెల్సీ కవిత
స్పాట్ వాయిస్, హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ శుక్రవారం సీఎం కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు నోటీసులు జారీ చేసింది. ఢిల్లీలో నమోదు చేసిన ఆర్‌సీ 53(ఎ)/2022 కేసులో దర్యాప్తు కోసం సీఆర్‌పీసీ సెక్షన్ 160 కింద ఢిల్లీకి చెందిన సీబీఐ అవినీతి నిరోధక విభాగం డీఎస్పీ అలోక్ కుమార్ షాహి ఈ నోటీసులు జారీ చేశారు.
6న దర్యాప్తు..
ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈనెల 6వ తేదీన ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లో కానీ, ఢిల్లీలో కానీ మీ నివాసంలో విచారించాలని అనుకుంటున్నాం. మీకు ఎక్కడ సౌకర్యంగా ఉంటుందో దయచేసి తెలియజేయండి’’
అంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. కేంద్ర హోంశాఖ డైరెక్టర్ ప్రవీణ్‌కుమార్ రాయ్ నుంచి వచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదు మేరకు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియాతోపాటు మరో 14 మందిపై కేసు నమోదైనట్లు ఇందులో తెలిపారు.
నోటీసులు వచ్చాయ్..
సీబీఐ నోటీసులు జారీ అయిన విషయాన్ని కవిత ధ్రువీకరించారు. తన వివరణ కోరుతూ సీఆర్‌పీసీ సెక్షన్ 160 కింద సీబీఐ నోటీసులు జారీ చేసిందని, వారి అభ్యర్థన మేరకు ఈ నెల ఆరో తేదీన హైదరాబాద్‌లోని మా నివాసంలో కలుసుకోవచ్చని అధికారులకు తెలియజేశానని చెప్పారు. ఇంటివద్దే వారికి వివరణ ఇస్తా’’ అని కవిత శుక్రవారం రాత్రి వెల్లడించారు.
Recent Comments