Sunday, November 24, 2024
Homeతెలంగాణతెలంగాణ కబ్జాకు కుట్ర..

తెలంగాణ కబ్జాకు కుట్ర..

ఆంధ్రా నుంచి దండులా విరుచుకుపడుతున్నారు..
మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
స్పాట్ వాయిస్, నల్లగొండ: స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి అన్నారు. నల్లగొండలోని తన నివాసంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణపై మరోసారి సమైక్యవాదుల కన్నుపడిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో మొహం చెల్లక తెలంగాణలో దండులా విరుచుకుపడుతున్నారని విమర్శించారు. మళ్లీ దోచుకుందామని తెలంగాణలో రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌ పాలనలో అన్నివర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. బీజేపీ దత్తపుత్రిక షర్మిల పాదయాత్రల పేరుతో సీఎం కేసీఆర్ ను అప్రతిష్ట పాలు చేస్తోందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఏడాది కాలంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల వెనుక సమైక్యవాదుల కుట్రలు ఉన్నాయని ఆరోపించారు. సీఎం కేసీఆర్ ను మానసికంగా దెబ్బ కొట్టేందుకు మూకుమ్మడిగా దాడి చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో చేతకాక తెలంగాణలో ప్రజలను మభ్య పెట్టి కేసీఆర్ అడ్డు తొలగించుకోవాలని మళ్లీ కబ్జా చేసేందుకు వస్తున్నారని ఆరోపించారు.

విషం చిమ్ముతున్న మోడీ
తెలంగాణపై ప్రధాని మోడీ అడుగడుగునా విషం చిమ్ముతున్నారని విమర్శించారు. ఎనిమిది రాష్ట్ర ప్రభుత్వాలను బీజేపీ కూల్చిందని మండిపడ్డారు. ఇప్పుడు ప్రధాని కన్ను తెలంగాణపై పడిందన్నారు.2014మోడీ అధికారంలోకి వచ్చాక ఏడు మండలాలు ఏపీలో కలిపారని గుత్తా తెలిపారు. దేశంలో ప్రభుత్వాలను కూల్చేకుట్రలు.. అనిశ్చితకరమైన వాతావరణం ఉందన్న ఆయన… ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments