Monday, November 25, 2024
Homeక్రైమ్ఎస్సైని తిట్టిన కేసులు ఇద్దరి అరెస్ట్..

ఎస్సైని తిట్టిన కేసులు ఇద్దరి అరెస్ట్..

ఎస్సైని తిట్టిన కేసులు ఇద్దరి అరెస్ట్..

నిందితుల్లో జర్నలిస్టు.., హ్యూమన్ రైట్స్ మెంబర్..
కారు, బైక్ సహా కీలక పత్రాల స్వాధీనం..
వివరాలు వెల్లడించిన సీఐ శ్రీనివాస్ జీ

స్పాట్ వాయిస్, హన్మకొండ క్రైమ్:ఎస్సైని  విపరీతంగా తిట్టి, బెదిరింపులకు పాల్పడిన ఘటనలో మహబూబాబాద్ జిల్లా తొర్రూరు గ్రామానికి చెందిన తాటికాయల క్రాంతి కుమార్, వరంగల్ రంగశాయిపేట్ కు చెందిన బుంగ జ్యోతిరమణ ని అరెస్ట్ చేసినట్టు సీఐ శ్రీనివాస్ జీ తెలిపారు. ఈ సందర్భంగా నిందితుల నుంచి పల్సర్ బండి, మొబైల్ ఫోన్, కారు, నాలుగు ఆల్ ఇండియా హ్యూమన్ రైట్ లెటర్ పాడ్స్, 14 ఆల్ ఇండియా హ్యూమన్ రైట్ మెంబర్ షిప్ సర్టిఫికెట్స్, 6 ఆల్ ఇండియా హ్యూమన్ రైట్ మెంబర్ షిప్ కార్డ్స్, 25 ల్యాండ్ కి సంబంధించిన కాపీలు, 22 తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ లకు చెందిన ధ్రువ పత్రాలు, 10 పలు పేర్ల మీద ఉన్న ఖాళీ స్టాంప్ పేపర్లు, 14 సెటిల్ మెంట్లు చేసిన స్టాంప్ పేపర్లు, ఒక తెలంగాణ ఐడీ కార్డు, 2 హ్యూమన్ రైట్స్ ఐడీ కార్డులు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా కేసుకు సంబంధించి వివరాలు వెల్లడించారు. సీఐ కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి..

ఈ నెల 26 వ తేదీ సాయంత్రం పెద్దమ్మ గడ్డలో భీమా భీమయ్య అనే వ్యక్తి అనుమానాస్పదంగా చనిపోయాడని బంధువులు ధర్నాకు దిగగా పోలీసులు మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించే క్రమంలో జన్ను రాజు అనే వ్యక్తి హనుమకొండ ఎస్సై డీ రాజుకు ఫోన్ చేసి హ్యూమన్ రైట్స్ కమిటీ మెంబర్ మాట్లాడతాడని ఇవ్వగా క్రాంతి కుమార్ ఎస్సైని ఇష్టారీతిగా తిట్టడమే కాకుండా బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈమేరకు ఎస్సై ఫిర్యాదుతో విచారణ జరపగా క్రాంతి కుమార్ గతంలోనే చిలకలగూడ పీఎస్ లో చీటింగ్, మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం, బోయినపల్లి పీఎస్ లో లైంగిక దాడి వంటి కేసులు నమోదై ఉన్నట్టు తెలిపారు. అదీకాకుండా క్రాంతికుమార్, బుంగ జ్యోతి, రమణ, రవి, సంజయ్ అనే వారుగా గ్యాంగ్ గా ఏర్పడి నేషనల్ హ్యూమన్ రైట్ మెంబెర్స్ అని, జర్నలిస్ట్ లమని, గిన్నిస్ బుక్ వరల్డ్ కో ఆర్డినేటర్లమని, హై కోర్ట్ అడ్వకేట్లమని చెప్పుకుంటూ దందాలు కూడా చేసేవారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఫోన్లు చేసి బూతులు మాట్లాడుతూ వాయిస్ రికార్డులు, పోస్ట్ చేస్తూ బెదిరింపులకు పాల్పడే వారు. గవర్నర్, సెక్రెటరీ పేరుతో భూ తగాదాల్లో తల దూర్చి బెదిరించే వారు. ఈ విషయాలై అడ్వకేట్ రవి సంజయ్ పై ఇబ్రహీం పట్నం, రాజాపేట్, మేడ్చల్, చిల్కలగూడ పీఎస్ ల్లో కేసులు నమోదయ్యాయి. ఇలాంటి చరిత్ర ఉన్న వీరంతా కలిసి భూతగాదాలు, సెటిల్ మెంట్లు చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారని విచారణలో తేలింది. అంతేకాకుండా పోలీసులను బూతులు తిట్టి సోషల్ మీడియా వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేస్తూ బ్లాక్ మెయిల్ చేస్తూ, మహిళలకు అసభ్యకరంగా పంపించిన మెసేజ్లు వంటివి ఉండడంతో క్రాంతి మొబైల్ ను సీజ్ చేసినట్టు చెప్పారు. కాగా, జాతీయ మానవ హక్కుల కమిషన్ కు, వీరికి ఎలాంటి సంబంధం లేదని, ఎవరైనా ఇలాంటి తప్పుడు చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సీఐ శ్రీనివాస్ జీ హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments